![]() |
![]() |

కంగనారనౌత్(Kangana ranaut)టైటిల్ రోల్ లో దివంగత 'ఇందిరాగాంధీ'(Indira gandhi)ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంభవించిన 'ఎమర్జెన్సీ' రోజుల్ని బేస్ చేసుకొని తెరకెక్కిన చిత్రం 'ఎమర్జెన్సీ'(Emergency). జనవరి 17 న రిలీజైన ఈ మూవీలో ఇందిరా గాంధీగా 'కంగనా రనౌత్' ప్రదర్శించిన నటనకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. మణికర్ణిక ఫిల్మ్స్ పై కంగనానే నిర్మాతగా వ్యవహరించగా ప్రస్తుతం ఓటిటి వేదికగా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ప్రముఖ జర్నలిస్ట్, రచయిత అయినటువంటి 'కుమికపూర్' రచించిన 'ఎమర్జన్సీ ఏ పర్సనల్ హిస్టరీ' అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.
కుమికపూర్(Coomi Kapoor)రీసెంట్ గా మణికర్ణిక ఫిల్మ్స్ పై, నెట్ ఫ్లిక్స్ పై ఒప్పంద ఉల్లంఘన,పరువు నష్ట దావా కేసు వేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు నేను రాసిన పుస్తక హక్కులని కొనుగోలు చేసేటప్పుడు నా అనుమతి లేకుండా నా పేరుని, పుస్తకం పేరుని ప్రచారం కోసం ఉపయోగించడకూడదని ఒప్పందం చేసుకున్నాం. కానీ ఒప్పందాన్ని ఉల్లంఘించి నా పుస్తకం ఆధారంగానే మూవీ తెరకెక్కిందని ప్రచారం చేసారు. పైగా కొన్ని సీన్స్ లో తప్పులున్నాయి. వాటిని తొలగించాలని నెట్ ఫ్లిక్స్ కి చెప్పినప్పటికీ ఆ సంస్థ తొలగించలేదు. ఈ విషయంపై లీగల్ నోటీసులు పంపించినా రెస్పాన్స్ లేదు. అందుకే నిర్మాణ సంస్థ, నెట్ ఫ్లిక్స్ పై చర్యలు తీసుకోవాలని కోర్టుని ఆశ్రయించానని తెలిపింది.
పక్కా రాజకీయ అంశాలతో తెరకెక్కిన ఎమర్జెన్సీ లో జనతా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ క్యారక్టర్ లో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee)గా శ్రేయాస్ తల్పడే, మొరార్జీ దేశాయ్ గా అశోక్ చబ్రా కనిపించారు. ప్రముఖ ఫిలాసఫీ నవలా రచయిత జిడ్డు కృష్ణమూర్తి(Jiddu Krishnamurti)గా అవిజిత్ దత్ చెయ్యగా, కంగనా నే దర్శకత్వం వహించింది.

![]() |
![]() |